ధనియాలు చీల్చే యంత్రం
మొక్కలు సరిగా రావడానికి ధనియాల విత్తనాలను
విత్తే ముందు రెండుగా చీల్చ వలసి ఉంటుంది. నోటిని తాజాగా (మౌత్ ఫ్రెష్నర్
గా) వుంచడానికి ఉపయోగించడానికి కూడా ప్రాసెసింగ్ అవసరమౌతుంది. సాంప్రదాయ
పద్ధతిలో ధనియాలను చేత్తోనే చీలుస్తారు. . అయితే ఈ పద్ధతి చాలా సమయం మరియు శ్రమ తో కూడుకున్నదే
కాకుండా విత్తనాలు పాడై పంట కోత అనంతరం నష్టాలకు దారి తీస్తుంది. కాబట్టి
యాంత్రిక పద్ధతి తప్పనిసరి. ఇందు కొరకు సి.ఐ.పి.హెచ్.ఇ.టి. (CIPHET)
ధనియాలు చీల్చే యంత్రాన్ని రూపొందించింది. ఈ యంత్రం 1 హెచ్.పి.మోటరు
సహాయంతో నడిచి గంటకు 60-80 కిలోల ధనియాలను చీలుస్తుంది. ఈ యంత్రంలో 6.5
సెం.మీ. వ్యాసం, 10 సెం.మీ. పొడవు కలిగిన రెండు రోలర్లు ఉంటాయి. ఇవి రెండూ
వేర్వేరు వేగాలతో తిరుగుతూ ఉండడం వలన ధనియపు గింజలు రెండుగా చీలతాయి. ఈ
యంత్రంలో ఒక గేర్ వంటి కొలమానం కూడా అమర్చబడింది. ఈ యంత్రం గింజలలోని తేమ
14.2% ఉన్నప్పుడు ధనియాలను చీలుస్తుంది.
No comments:
Post a Comment